మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసుకుందాం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంతో పాటు ధూప్ సింగ్ తండా,గిర్ని తండా, గాలిపూర్,మాగ్దుంపూర్,కోమలంచ,తుంకిపల్లి,నర్వ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..పదిహేనేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నియోజకవర్గ అభివృద్ధిపై కనీస శ్రద్ధ చూపించలేదని,గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కూడా అందించలేకపోయారని విమర్శించారు.తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు,ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.ఈ అభివృద్ధి మరింత వేగంగా ముందుకు వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.సర్పంచ్ లు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి గ్రామ సమస్యలు వివరించగలగాలి. నాయకులు–ఎమ్మెల్యే మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయి అని చెప్పారు.కానీ మీరు గెలిపించే వ్యక్తి ఎమ్మెల్యే దగ్గరకు రాలేకపోతే,మీ గ్రామం అభివృద్ధి ఎలా అవుతుందో ఆలోచించుకోవాలి అన్నారు.అందుకే అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు..మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని,గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని అన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలిసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాగ్దుంపూర్ సర్పంచ్ అభ్యర్థి సుమయాఅథిక్ లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,నాయకులు ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి, నాగభూషణం గౌడ్,ఖాళీక్,లోక్య నాయక్,ఇఫ్తే కార్,కాశయ్య,సంతోష్ రాథోడ్, సవాయి సింగ్,హన్మంలు, మల్లయ్య గారి ఆకాష్,తదితరులు ఉన్నారు.







