ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారిచాలని నినాదాలు చేపట్టారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏలేశ్వరం శాఖ మేనేజరుకు అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారిచని యెడల ఉద్యమం తీవ్ర తరం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ. జి ఓ నెంబర్ 36 వెంటనే అమలు చేయాలని, అన్నారు. 2019బి2024వేతన సవరణ వెంటనే చేపట్టాలని తెలిపారు.గ్రాడ్యూటీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలని, 2019 తరువాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని తెలిపారు. సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని, సంఘాలకు షేరుదనం పై ఇవ్వాల్సిన 6% డివిడెంట్ వడ్డీ. చెల్లించాలని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల సీ ఈ ఓ లు, జ్యోతుల శ్రీనివాస్, ఉప్పలపు విజయ్ కుమార్ రాజు, జే గోపాల కృష్ణ, ఏ మణిరాజు, కో-ఆపరేటివ్ జిల్లా యూనియన్ అధ్యక్షులు కే ఆదినారాయణ, సహచర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






