.*ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్చార్జ్ గొంప శివకుమార్*
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో, ఈనెల 11వ తారీఖున జరగబోతున్న ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం గావించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ ఇంచార్జ్ గొంప శివకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.రాజకీయ శక్తిగా కీలకమైన అడుగులు దిశగా బిసివై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో, ఘనంగా జరుగుతున్న ఏపీ బీసీ మహా సదస్సు, రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారాన్ని సాధించేందుకు తీసుకునే నిర్ణయాలకు తొలి అడుగుగా భావించాలని ఆయన అన్నారు బీసీ సంఘాల అధ్యక్షులు, బీసీల లోని అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు,ప్రతి ఒక్కరు 11వ తారీఖున విజయవాడ లోని హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్ లో , ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రంగ రంగ వైభోగంగా జరగనుందనీ, రాష్ట్రంలోని ప్రతి బీసీ పెద్దలు, నాయకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క సదస్సు పాల్గొని విజయ వంతం చేస్తారని కోరుకుంటున్నాను అని గొంప శివకుమార్ యాదవ్ ఈ సందర్భంగా తన ప్రకటన లో నియోజకవర్గ బీసీ పెద్దలకు మరియు నాయకులకు విన్నవించారు.






