చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన దేవరాజులు,ఆండారెడ్డిపల్లికి చెందిన లోకేష్ లు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరడం జరిగింది.ప్రభుత్వం తరపున చెరో 50వేలు మంజూరు కావడం జరిగింది.ఆ చెక్కులను గురువారం లబ్ధిదారులకు రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ డైరెక్టర్ పొన్న యుగంధర్,రాయలసీమ రీజియన్ జనసేన కోఆర్డినేటర్ పుష్ప చేతుల మీదగా అందించారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు పవన్,అనిల్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.







