గట్టుపల్లి–చింతలపాలెం హత్య కేసు పరిశీలన అనంతరం తిరుగు ప్రయాణంలో విషాదం. ప్రమాద వాహనదారుడిని వెంటనే పట్టుకోవాలని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉత్తరాఖండ్ వలస కూలీ దుక్కి రామ్ రాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి
21మంది వలస కూలీలకు నేను అండగా ఉంటా బాధితులకు ధైర్యం చెప్పిన ఉదయగిరి ఎమ్మెల్యే..!
వలస కూలీల దారి ఖర్చుల కోసం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10,000 తక్షణ ఆర్థిక సహాయం..!

జలదంకి నవంబర్ 27 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి://

జలదంకి మండలం గట్టుపల్లి–చింతలపాలెం ప్రాంతంలో జరిగిన దారుణ హత్య సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం తిరుగు ప్రయాణంలో 9వ మైలు సమీపంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నేషనల్ హైవే పై జరిగిన మరో విషాదకర ఘటనను గమనించారు.ఉత్తరాఖండ్‌ నుంచి వలసవచ్చి జీవనోపాధి కోసం పనిచేస్తున్న 21 మంది కార్మికులలో ఒకరైన దుక్కి రామ్ రాయ్ ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ హృదయ విదారక సంఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శ్రద్ధగా పరిశీలించి, ప్రమాదానికి కారణమైన వాహనదారుడిని గుర్తించి పట్టుకునేందుకు తక్షణమే పోలీసు వ్యవస్థకు ఆదేశాలు జారీ చేశారు. నేరస్థుడిని పట్టుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అదే సమయంలో, ప్రమాదంతో ఆందోళనలో ఉన్న మిగతా 20 మందికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం మరియు తాను పూర్తి స్థాయి అండగా ఉంటానని ఎమ్మెల్యే కాకర్ల హామీ ఇచ్చారు.వారి ప్రయాణం ఆగిపోకుండా,వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు.అతడు మరణించిన దుక్కి రామ్ రాయ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి పంపేందుకు ప్రభుత్వం మరియు స్థానిక అధికారులతో సమన్వయం చేసి తగిన ఏర్పాట్లు చేస్తానని ఛేదించారు.వలస కూలీల తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వారి దారి ఖర్చులకు సాయం చేయడానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదివేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కష్ట సమయంలో వారు ఒంటరిగా లేరని, తమకు అన్ని విధాల సహకారం అందుతుందని వారికి భరోసా ఇచ్చారు

  • Related Posts

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    నియోజకవర్గంలో సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు 21 బిఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు…బిఎస్ఎన్ఎల్ టవర్లకు త్వరితగతిన స్థలం కేటాయించండి నెల్లూరు,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 09,(నాగరాజు కె) మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు మరో అడుగు పడనుంది.టెలికాం…

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    ఉదయగిరి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 09,(కె నాగరాజు) –బుధవారం జిల్లా కేంద్రానికి సంతకాల సేకరణ ప్రతులు మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 6 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు