మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు భారత రాజ్యాంగ దినోత్సవం ను ఎన్‌ఎస్‌ఎస్ మరియు డిపార్ట్మెంట్ ఒఫ్ పోలిటికల్ సైన్స్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్య క్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు భారత రాజ్యాంగం అనేది భారతదేశ అత్యున్నత చట్టమని , ఇది దేశ పరి పాలన, ప్రభుత్వ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, బాధ్యతలు మొదలైన వాటిని నిర్దేశిస్తుందని . ఇది ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగమని , ఇందులో 25 భాగాలు, 448 ఆర్టికల్స్, మరియు 12 షెడ్యూల్‌లు ఉన్నాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ దీనిని రూపొందించిందని, మరియు ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని, భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులతో పాటుగా భాద్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలని కోరారు అన్ని వర్గాల ప్రజలకు శ్రీరామ రక్ష భారత రాజ్యాంగమని విద్యార్దులు చట్టాలు, ఆర్టికల్స్ పై అవగాహన కలిగి ఉండాలని, భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డా. బి .ఆర్ అంబేడ్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్ధులకు రాజ్యాంగ పై క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. రాజ్యాంగ ప్రతిజ్జ్ఞ విద్యార్ధులతో చేయించారు. ఈ కార్యక్రమమలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ పోలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ అద్యాపకులు డా. శివప్రసాద్ వైస్ ప్రిన్సిపల్ కె. వేంకటేశ్వర రావు ఇతర అద్యపకులు వి రామ రావు , క. సురేశ్. వీరభద్ర రావు, ఎస్‌కే మదీనా, శ్రీమతి శ్రీ లక్ష్మి , కె బంగార్రాజు,మేరి రొసిలిన శ్రీమతి పుష్పా శ్రీ సతీశ్ మరియు అధ్యాపకేత సిబ్బంది సత్యనారాయణ , ధర్మ రాజు , దివ్య,రామలక్ష్మి కమల, కళావతి , పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *