మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : అంబేడ్కర్ గురుకుల కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ చంద్ర శారద ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మండల విద్యా శాఖ అధికారి అబ్బాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని కళాశాల అధ్యాపకులతో కలిసి విద్యార్థినులువీక్షించారు,అనంతరం వ్యాసరచన, ఉపన్యాసము, చిత్రలేఖనం, పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిధుల చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా మాట్లాడిన యం ఈ ఓ అబ్బాయి మాట్లాడుతూ“రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి హృదయమని, విద్యార్థులు అందులోని హక్కులు, బాధ్యతలు తెలుసుకొని మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శారద మాట్లాడుతూ,“రాజ్యాంగం అందించే సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలు ప్రతి విద్యార్థి ఆచరణలో ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.