మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 22: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులోని విపిఆర్ నివాసం వద్ద శనివారం ఘనంగా జరిగాయి. కోవూరు జనసేన నాయకులు గుడి హరిరెడ్డి, డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో తరలి వచ్చిన అభిమానుల మధ్య విపిఆర్ నివాసం వద్ద భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా చప్పుళ్ళు, తీన్మార్ మోతల మధ్య జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లా అభివృధి ప్రదాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణిగా కోవూరు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రశాంతమ్మ పని చేస్తున్నారని చెప్పారు. వేమిరెడ్డి దంపతుల చల్లని ఆశీసుల మధ్య జిల్లా, కోవూరు ప్రజలు నిశ్చింతగా జీవిస్తున్నారని చెప్పారు. విపిఆర్ నేత్రా, విపిఆర్ అమృతధార, విపిఆర్ విద్య వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చిస్తూ జిల్లా ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఇలాంటి దంపతులు నెల్లూరు జిల్లాలో ఉండడం జిల్లా వాసుల అదృష్టమని కొనియాడారు. ప్రశాంతమ్మకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.


