మన ధ్యాస ,కోవూరు, నవంబర్ 22:రక్తదానం..ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ అపోహలు వీడి రక్తదానం చేయాలని తెలుగుయువత నాయకులు పేర్కొన్నారు. శనివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో పట్టణంలోని పీవీఆర్‌ కళ్యాణ మండపంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మెడికవర్‌ ఆస్పత్రి వారి సౌజన్యంతో మహిళలకు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు, షుగర్‌, బీపీ, ఈసీజీ పరీక్షలను నిర్వహించారు. అలాగే రక్త పరీక్షలు సేకరించారు. ఉచితంగా మందులు అందజేశారు. అలాగే జయభారత్‌ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించారు. అలాగే నోవా బ్లడ్‌ బ్యాంక్‌కు 162 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సుమారు 1000 మంది ప్రజలు ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులయ్యారు. అలాగే ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత భారీ కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *