
జీడి నెల్లూరు అలిమేలమ్మ దేవస్థానం ప్రాంగణం నందు మండల మామిడి రైతుల సమావేశం జి. త్యాగరాజు రెడ్డి అధ్యక్షతన. యు సందీప్ సహకారంతో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి.మనీశ్వర్ రెడ్డి, బంగారు మురళి మాట్లాడుతూ, ఈ నెలాఖరు లోపల మామిడి రైతులకు ర్యాంపులు గుజ్జు పరిశ్రమలు ఇవ్వాల్సిన బకాయిలు ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది రూపాయల చొప్పున ఇవ్వాలని. అలా ఇవ్వని పక్షంలో డిసెంబర్ నెలలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ముట్టడించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర సాధన కోసం గంగాధరనెల్లూరు మండలంలోని మామిడి రైతులందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశానికి జిల్లా నాయకులు మునిరత్నం నాయుడు,సంజీవరెడ్డి,మోహన్ రెడ్డి, పాల్గొని ప్రసంగించారు. అనంతరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా. జి త్యాగరాజు రెడ్డి. కన్వీనరు.యు. సందీప్. కమిటీ సభ్యులుగా రఘుపతి రెడ్డి,గుణశేఖర్ రెడ్డి,హరికృష్ణ రెడ్డి,అశోక్,మోహన్ నాయుడు,వాసుదేవ రెడ్డి, పట్టాభి రెడ్డి, వేణు నాయుడు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదుపరి ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకొని. అన్ని పంచాయతీల భాగస్వామ్యంతో పూర్తిస్థాయి కమిటీ ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో. దామోదర్ రెడ్డి,తిరుమల నాయుడు, నవీన్,పురుషోత్తం రెడ్డి. సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆనంద రెడ్డి,వెంకటరెడ్డి, పృద్వి,సూర్య నాగిరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, కిరణ్ కుమార్, రేవంత్, సాంబశివారెడ్డి మరియు మామిడి రైతులు పాల్గొన్నారు.







