వింజమూరు, అక్టోబర్ 28 :(మన ధ్యాస న్యూస్ )://

మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సూచించారు.తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రతి శాఖాధికారులు తమ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.“ఈ తుపాన్ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అవసరమైతే పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి — ప్రజలను ముందుగానే అక్కడకు సురక్షితంగా తరలించాలి.”ప్రజలను అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు.”⚠️ ప్రజలకు సూచనలు:🔴మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.🔴తుపాన్ సమయంలో పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించి కాపాడుకోవాలి.🔴విద్యుత్, నీటి, ఆహార సరఫరా వంటి సేవల్లో అంతరాయం రాకుండా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేయాలి.
☎️ అత్యవసర సహాయం కోసం:📞 స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 112 మరియు 1070,📞 టోల్ ఫ్రీ నెంబర్: 1800-425-0101,,,,ఏ సహాయం కావాలన్నా రాష్ట్ర లేదా జిల్లా కంట్రోల్ రూమ్‌లను సంప్రదించండి.☎️📞ఎమ్యల్యే క్యాంపు కార్యాలయంలో తుఫాన్ కొరకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు: 8522084270,,,9390011493.








