మన ధ్యాస,ఇందుకూరుపేట, అక్టోబర్ 26: కార్తీకమాసం సంధర్భంగా దేవాలయాలకు దీపధూప నైవేద్య సామాగ్రి కిట్ లు సమర్పణ చేసే కార్యక్రమం ఆదివారం “ధర్మసింధు ఆధ్యాత్మిక సేవాసమితి” ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలోని కొమరిక, మైపాడు,నరసాపురం, రావూరు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఆలయాలకు సమర్పణ చేయడం జరిగింది.ధర్మసింధు ఆధ్యాత్మిక సేవాసమితి కన్వీనర్ ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ…… ఈ కార్యక్రమాన్ని గత పదేళ్లుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి ఎయిడ్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పూజా సామాగ్రి కిట్ లో రెండు లీటర్లు స్వచ్ఛమైన నువ్వుల నూనె, రెండు అగరవత్తులు పాకెట్స్, 360 వత్తులు, కర్పూరం, గంధము, విభూతి,పసుపు కుంకుమలు, కలకండ మరియు ఆధ్యాత్మిక పుస్తక ప్రతులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన యానాదుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎందేటి సురేంద్ర, ఎస్ ఎస్ ఎఫ్ బాలవికాస కేంద్రం మాతాజీ మానస, ఎస్ ఎస్ ఎఫ్ కమిటీ సభ్యులు సరోజనమ్మ, పొట్లూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.








