దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా..!ఒక్కరినైనా ఇవ్వమని మొక్కుతా..! అనూష తల్లి ధనమ్మ.. ఆర్ధనాధాలు.,బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన మృతదేహాలు గోళ్ల వారి పల్లి గ్రామానికి చేరిక..!గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో జరిగిన సంఘటనలు చెబుతూ బోరున విలపించిన కుటుంబ సభ్యులు..!
వింజమూరు అక్టోబర్ 26 :(మన ధ్యాస న్యూస్ ):///


దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా.. నా బంగారు తమ్ముణ్ణి, నా కూతురు మనవడు, మనమరాల్ని బ్రతికించమని వేడుకుంటానని, ధనమ్మ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని పట్టుకొని బోరున విలపించారు. కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన మృతదేహాలు గోళ్ల వారిపల్లెకు చేరుకునే క్రమంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే వారి నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు జరిగిన పరిణామాలను వివరిస్తూ బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గోళ్ల వారిపల్లె గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి పార్థివ దేహాలు చేరుకోవడంతో ఆర్ధనాధాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంత్యక్రియల ఏర్పాట్లకు అన్ని సిద్ధం చేసుకోవాలని, దానికి అవసరమైన ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని, స్థానిక నాయకులతో తెలిపి, ఏర్పాట్లను సిద్ధం చేయించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి కుటుంబ పెద్దగా అన్నీ తానై ఎమ్మెల్యే చూసుకుంటున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎమ్మెల్యే దాతృత్వం మరువరానిదని, చుట్టపు చూపుగా కాకుండా, ప్రేమ అభిమానాలు చూపుతూ, బాధలో కుటుంబానికి అండగా నిలిచిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వెంట మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు, చాకలి కొండ మరియు గోళ్ల వారిపల్లె నాయకులు బంధు మిత్రులు తదితరులు ఉన్నారు.









