ఇందుకూరు పేట, అక్టోబర్ 26 :(మన ద్యాస న్యూస్):///

పధ్మశ్రీ మందకృష్ణ మాదిగ,ఆదేశాల మేరకు,26.10.2025 తేది ఆదివారం
ఎమ్ ఆర్ పి ఎస్, నాయకులు బర్రె శివ,మాదిగ ఆధ్వర్యంలో ఇందుకూరు మండలంలోని రాముడిపాలెం గ్రామంలో మండల స్థాయి సమావేశం వేర్పాటు చేశారు ఈకార్యక్రమానికి *ముఖ్య అతిథిలుగా *ఎమ్ ఎస్ పి, జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ,ఎంఎస్పీ కోవూరు నియోజకవర్గ ఇన్చార్జీ కొమరిక రమణయ్య మాదిగ పోల్గొని వారు మాట్లాడుతూ*భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి పై జరిగిన అనాగరిక దాడిగా ఖండిస్తూ,పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నవంబర్ 1న ఛలో హైదరాబాద్ లో జరుగు దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన మహార్యాలీని విజయవంతం చేయాలని.
ఈదేశంలో వివక్షతో కూడిన దాడులకు వ్యతిరేఖంగా,మన జాతుల అస్థిత్వాన్ని,ఉనికిని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా దేశవ్యాప్తంగా దాడులు చేసే వ్యక్తులకు, శక్తులకు భయం పుట్టేలా,మన వర్గాల్లో ఆత్మస్థైర్యం, దైర్యం నింపేలా ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని అదేవిదంగా నవంబర్ 1 ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గం నుండి వేలాదిగా మాదిగలు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో,ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ సీనియర్ నాయకులు దర్శిగుంట శ్రీనివాస్ మాదిగ,బర్రె ప్రసాద్ మాదిగ,మొండెం రాజేష్ మాదిగ,కొమరిక శేషయ్య మాదిగ,కొండా మీరయ్య మాదిగ,ఆర్ బాబు మాదిగ,బి గోవర్ధన్ మాదిగ,కె.సిసీంద్రీ మాదిగ,కె శ్రీనివాసులు మాదిగ,కె శీనయ్య మాదిగ, బి వెంకయ్య మాదిగ,కె యానదయ్య మాదిగ, ఎం రాధయ్య మాదిగలు మహిళలు పెద్దలు యువకులు,తదితరులు అధిక సంఖ్యలో,పాల్గొన్నారు.








