పాలసముద్రం, మన ధ్యాస, అక్టోబర్ 25:మండలంలోని వనదుర్గాపురం, బలిజ కండ్రిగ గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు రేయింబవళ్లు దర్జాగా తవ్వి తమిళనాడుకు తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.నియోజకవర్గ నాయకుడు పేరు చెప్పి అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.అయితే అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు ముందుగా అక్రమార్కులకు సమాచారం ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.తాము వెళ్లే సరికి ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని అధికారులు చెబుతున్నారని అంటున్నారు.గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అధికారులకు ముడుపులు అందుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.అలాగే మండలంలో నిజాయితీగా పనిచేసిన తాసిల్దారుని అవినీతికి అక్రమాలకు సహకరించలేదని బదిలీ చేయించారని.మండలంలో అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపిన నిజాయితీ గల ఎస్ఐ ని కూడా రాజకీయ అండదండలతో బదిలీ చేస్తున్నారని ఇలా అయితే కూటమికి చెడ్డ పేరు వస్తుందని పెద్ద ఎత్తున మండల ప్రజలు మాట్లాడుతున్నారు.దీనిపైన జిల్లా స్థాయి అధికారులు స్పందించి నిజాయితీగల అధికారులకు సకరించాలని మండల ప్రజలు కోరారు.అలాగే మండలంలో అక్రమ గ్రావెల్ క్వారీలపై సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి కాలుష్య నియంత్రణ బోర్డు మరియు గనుల శాఖ రెవెన్యూ శాఖలను నిబంధనలను ఉల్లంఘించిన వాళ్ళపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు.త్వరలో దీనిపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు నమోదు చేస్తానని మీడియాకు తెలిపారు.గ్రామ సర్పంచులు ! మా గ్రామాలలో కొత్త క్వారీలకు అనుమతులు లేవు- ఉన్న క్వారీల అనుమతులు కూడా రద్దు చేస్తాం!ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ ఎంతోకాలంగా గ్రామంలో పశువుల,గొర్రెలు,మేకల పెంపకందార్లు కొండకు జీవాలను మేతకు తోలుకుని వెలుతుంటారన్నారు.ఇష్టానుసారం గ్రావెల్‌ను తమిళనాడు కు అక్రమంగా తరలించడం వలన కొండలు నామరూపాల్లేకుండా పోతున్నదన్నారు.భవిష్యత్తులో జీవాల మేతకు ఇబ్బందిగా ఉంటుందని అక్రమంగా గ్రావెల్ తరలించకుండా కొత్త క్వారీలకు అనుమతులు ఇవ్వకుండా పంచాయతీల తరఫున ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పలువురు సర్పంచులు మీడియా కు తెలిపారు.







