నవ వధువుకు పదివేల రూపాయల పెళ్ళికానుక అందజేత..!
ఉదయగిరి అక్టోబర్ 18 (మన ధ్యాస న్యూస్):/
ఉదయగిరి మండల కేంద్రం లోని కోళ్ల వీధికి చెందిన షేక్ జానీ భాషా – శ్రీమతి దిల్ షాద్ దంపతుల కుమార్తె వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10 వేల రూపాయలను పెళ్లి కానుకగా స్థానిక నాయకుల ద్వారా పెళ్లికుమార్తెకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన వధూవరులకు హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలుపుతూ, వారి జీవితాలు ఆనందం, ఐశ్వర్యం, పరస్పర ప్రేమతో నిండిపోవాలని ఆకాంక్షించారు.అంతేకాక, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద మరియు అవసరమైన కుటుంబాలకు విద్య, వైద్యం, వివాహ సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా, అందజేయబడుతున్నాయని తెలిపారు. సామాజిక సేవ పట్ల భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో TNTUC అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాసులు, స్థానిక నాయకులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.







