
మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు నగరంలోని హారనాథపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ........ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మన నవ్యాంధ్ర ప్రదేశ్ కు రావటం అత్యంత సంతోషకరమని అన్నారు. అందరం కలిసికట్టుగా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. గూగుల్ ఆంధ్రకు వచ్చిందని గర్వపడాల్సింది పోయి వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కి రావటంతో ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతుందని అన్నారు. అక్కడక్కడ వర్షానికి నీరు వచ్చి ఆగినా, వైసిపి నాయకులు దానిని టిడిపి తప్పిదమని చెప్పే పనిలో ఉన్నారని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కు రావటం చంద్రబాబుకు లోకేష్ కు ఐటి రంగంలో ఉన్న అనుభవానికి నిదర్శనమని అన్నారు. దాదాపు కోటి ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్తు గూగుల్ డేటా సెంటర్‌కు అవసరమని ఆ విద్యుత్తు ఇచ్చేందుకు ఆంధ్ర రాష్ట్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఆదా నీ డేటా సెంటర్ వారు పోర్టుతో కలిపి 15000 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారని గూగుల్ లక్ష 35 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయంటే ప్రభుత్వంపై ఉండే నమ్మకమని అన్నారు. పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్‌తో వైజాగ్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి ఒక హబ్ గా మారనుందని అన్నారు. డేటా సెంటర్ ఆంధ్రకు రావటం వైసిపి నాయకుడు విమర్శలు చేసినంత సులభం కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ ఉండబోతుందని పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉంటుందని నమ్మి నిర్ధారించుకుని గూగుల్ పెట్టుబడులు పెడుతుందని అన్నారు. పక్క రాష్ట్రాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నాయని మనం రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ఆకర్షించాలని అన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని ఎప్పటికో కడతారన్న భావన ఉండేదని చంద్రబాబు వచ్చాక ఆ భావన పోయిందని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో రాజకీయ నాయకుల పిచ్చికూతలు ఎవరూ నమ్మవద్దని, చంద్రబాబు లోకేష్‌ల జీవితంలో ఇది ఒక మైలు రాయిలా నిలవబోతుందని అన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో భావితరాలు గూగుల్ గురించి మాట్లాడుకుంటాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
