ఐరాల అక్టోబర్ 06 మన ద్యాస
భారత దేశపు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి ఒక లాయర్ చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం. దీనిపై చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో స్పందిస్తూ అట్టడుగు వర్గాల ప్రజలు,వ్యక్తి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న కుల వివక్షత వెంటాడుతూ ఉంటుంది అనటానికి ఈరోజు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గవాయిపై ఒక లాయర్ ప్రత్యక్షంగా తన చెప్పుతో దాడి చేయాలని ప్రయత్నించటం అనాగరికత,చదువుకున్న నిరక్షరాస్యుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటం దుర్మార్గం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి రాజ్యాంగం మీద,భారత పార్లమెంట్ మీద,భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద,ప్రజాస్వామ్యం మీద దాడిగా పరిగణించి,ఆ లాయర్ పై దేశద్రోహం కేసు పెట్టి బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఇలా జరిగితే,సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని తన ఆవేదనని వ్యక్తం చేశారు.







