మన ధ్యాస, నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 6:నెల్లూరు నగరం, స్థానిక మినీ బైపాస్ రోడ్, శ్రీహరి నగర్ లో హరిణి క్యాటరింగ్, హరిణి హోటల్ ను సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిణి క్యాటరింగ్స్ హోటల్ అధినేత పెంచలయ్య (సీపీ)కి అభినందనలు తెలియజేశారు. అనంతరం కార్పోరేటర్ చేజర్ల మహేష్, క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వినయ్ లు మాట్లాడుతూ…….. పెంచలయ్య హోటల్ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారని నెల్లూరు ప్రజల అభిరుచికి అనుగుణంగా అల్పాహారంతో పాటు చక్కటి వంటకాలతో హోటల్ ను తిరిగి అందుబాటులోకి తీసుకొని వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, ఓట్టూరు సురేంద్ర యాదవ్, మడపర్తి శ్రీనివాసులు, కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, మూలే విజయభాస్కర్ రెడ్డి,టిడిపి నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, అరవ శ్రీనివాసులు, కరణం హజరత్ నాయుడు, చెక్క సాయి సునీల్, క్యాటరింగ్ అసోసియేషన్ వినయ్, నెల్లూరు క్లబ్ కార్యదర్శి అశోక్, సాబీర్ ఖాన్, లీలా, యానాదయ్య, కోటిరెడ్డి, పులి హరికృష్ణ, భీమతాటి సుధాకర్, తోట శోభారాణి, చేజర్ల కవిత, పద్మజ యాదవ్ పాల్గొన్నారు.









