ఘనంగా శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ 50వ వార్షికోత్సవ వేడుకలు

పూతలపట్టు అక్టోబర్ 02 మన ద్యాస

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మంగళ్ విద్యాలయం, పేటమిట్ట గ్రామమునందు 50వ శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగిన ఎంతోమంది పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే నెపంతో కీర్తి శేషులు పాటూరి రాజగోపాల్ నాయుడు స్ఫూర్తితో డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా , శ్రీకృష్ణదేవరాయ విద్యాసాంస్కృతిక సంఘాన్ని స్థాపించి, అందులో ఎంతో మంది దాతలను భాగస్వాములుగా చేసి, పదవ తరగతిలో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు మరియు ఇంటర్, డిగ్రీ , బీటెక్, సిఏ మొదలైన కోర్సుల్లో ప్రతిభ కనపరచిన 250 మంది విద్యార్థినీ విద్యార్థులకు 50 లక్షల రూపాయలు ఉపకార వేతనాలను అందించారు . గౌరవనీయులు గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ ఇటీవల తాను రాసిన స్వీయ చరిత్ర పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆ పుస్తకం మొదటి ముద్రణలోని 5000 పుస్తకాలు అమ్ముడయ్యాయి. ఆ పుస్తకాల ద్వారా వచ్చిన నగదును గత సంవత్సరము అక్షరాల 50 లక్షల రూపాయలు, ఈ ఏడాది 50 లక్షల రూపాయలు మొత్తం కలిపి కోటి రూపాయలు పేద విద్యార్థుల చదువుకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆ మొత్తాన్ని ట్రస్టుకు విరాళంగా అందించడానికి చాలా సంతోషపడుతున్నామని అదేవిధంగా ఇది నా డబ్బు కాదు, పదివేల మంది చేతుల ద్వారా విరాళంగా అందించారు మరియు ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థులు అందరూ కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని దీవిస్తున్నాని తెలియజేశారు. ఈ సందర్భంగా అమర రాజా సంస్థల అధినేత రామచంద్ర నాయుడు గల్లా మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా 1968లో 1000 రూపాయల పెట్టుబడితో ఈ ట్రస్ట్ ను స్థాపించగా నేడు 10 కోట్లు దాటింది. విద్యార్థులు భవిష్యత్తులో స్థిరపడి ఈ సంస్థకు మరింత చేయూతనిస్తే మరి కొంతమందికి సహాయం చేయవచ్చని సూచించారు. ఈ ట్రస్ట్ కు విరాళాలు అందజేస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ కృష్ణ దేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ అధ్యక్షురాలు అయిన డాక్టర్ గౌరినేని రమాదేవి మాట్లాడుతూ లబ్ధి పొందిన విద్యార్థులందరూ చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సరస్వతీపుత్ర బిరుదాంకితులు, టి.టి.డి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా.మేడసాని మోహన్ , మాట్లాడుతూ వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి ఆదుకుంటున్న గల్లా కుటుంబాన్ని ముందుగా అభినందించారు. ఈ సంస్థకు విరాళాలు ఇచ్చి తమ దాతృత్వాన్ని దాటుతున్న వారందరినీ అభినందించారు విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.అలాగే ప్రణీత్ పెనుమాడు డైరెక్టర్ ఆప్ ఎడిపై విద్యాసంస్థల అధినేత మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతైనా అవసరం అని గుర్తించి , గల్లా రామచంద్ర నాయుడు గారు పేద విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి ఉపకార వేతనాలు అందించడం ఎంతో ప్రశంసనీయం అని మెచ్చుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా అలరించాయి. ఈ సంస్థ కార్యదర్శి మహదేవ నాయుడు , కార్యవర్గ సభ్యులైన, సతీష్ రాళ్ళపల్లి, బాలాజీ కిరణ్ , ప్రణీత్ సుధీర్, డా. ప్రసాద్, ఉమాకాంత్, పేటమిట్ట గ్రామ సర్పంచ్ గల్లా రాధాక్రిష్ణ , ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, దాతలు, పుర ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!