భారీగా తగ్గనున్న వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు నిత్యవసర వస్తువులు..!సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే..!సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
వింజమూరు సెప్టెంబర్ 30 :(మనధ్యాస న్యూస్):////వైసిపి అసత్యపు ఆరోపణలను గ్రామస్థాయి నుండి మండలం మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు తిప్పి కొట్టాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మంగళవారం వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 122 మంది బాధితులకు సుమారు ఒక్క కోటి ఒక్క లక్ష 75 వేల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తూ ప్రజలపై ఎలాంటి భారం పడకుండా నేరుగా ప్రజలకే లబ్ధి చేకూరే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. డబల్ ఇంజన్ ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, నిత్యవసర ధరలు, సుమారు 13% తగ్గినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రానికి నష్టం చేకూరుతున్నప్పటికీ, ప్రజలకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రోజుకి సుమారు 8 కోట్ల రూపాయలు దీని ద్వారా ప్రభుత్వానికి నష్టమన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిని కూటమి నేతలందరూ ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశారని ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి దక్కిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తల్లికి వందనం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు నేరుగా 13,000 జమ చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 3000 నుండి 4000, వికలాంగులకు 6000, డయాలసిస్ పేషెంట్లకు 15,000 రూపాయలు పెంచి ప్రతి నెల ఒకటో తేదీ అందజేయడం జరుగుతుందన్నారు. భూ టైటిల్ యాక్టును రద్దుచేసి రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. మహిళలకు ఉచితంగా ఏడాదికిమూడు సిలిండర్లు అందజేస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ధార రైతన్నల ఖాతాలకు సంవత్సరానికి 20,000 అందజేయడం జరుగుతుందన్నారు. అందులో మొదటి విడత 7,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, అమరావతి మరియు పోలవరం నిర్మాణాలను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రమిస్తున్నారని తెలిపారు. ఆ బాటలో మనమందరం కూడా పయనించాలని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లాలన్నారు.









