
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారి రూపంలో శ్రీ దుర్గాదేవిగా రూపాలలో
దర్శనమిస్తారు.ఆ అమ్మవారి అవతారంలో బోనమెత్తి మా గ్రామాన్ని చల్లగా చూడమ్మా తల్లి అంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం దెబ్బల పాలెం యూత్ ఆధ్వర్యంలో భారీ భక్త జన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది.ఉదయం నుండి భక్తిశ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి భాజా భజంత్రీలతో,వేదమంత్రాలతో,దుర్గమ్మ అమ్మవారి శరణు ఘోషతో బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో తిరిగారు.భక్తి శ్రద్దలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకధాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న వారితో ఊరేగింపుగా వెళ్లడంతో ఏలేశ్వరం లో
ఆధ్యాత్మిక శోభ సంతరించికుంది.అనంతరం బోనాలలో ఉన్న పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించి నిర్వాహకులు ఏర్పాటుచేసిన .ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అభినందించారు.భక్తిశ్రద్ధలతో బోనంమెత్తిన మహిళలు అమ్మవారిని మా గ్రామాన్ని సుభిక్షంగా చూడాలని, పాడిపంటలతో,సిరిసంపదలతో ఉండేటట్లు దీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మూది నారాయణస్వామి,మీసాల సత్యం,గూనాపు అశోక్, శిడగం సురేష్, చల్లా ప్రసాద్, ఒమ్మి కృష్ణ, కర్రి రాంబాబు, మజ్జి శ్రీను, మజ్జి రామకృష్ణ పాల్గొన్నారు









