మన ధ్యాస,నెల్లూరు ,సెప్టెంబర్ 30 :నెల్లూరు కృష్ణపట్నం పోర్టు లో ఉన్న ఆయిల్ కంపెనీలు వ్యాపారస్తుల్ని మోసం చేస్తున్నాయని శ్రీకాళహస్తి కి చెందిన ఆర్టిఏ సెక్రటరీ యోగానంద్ ఆరోపించారు.నెల్లూరు ఆచార వీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో యోగానంద్ మంగళవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించినారు ఈ సమావేశంలో ఆయన నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం లో ఉన్న ఆయిల్ కంపెనీల పై త్రీవరంగా మండిపడ్డారునెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఉన్న ఆయిల్ కంపెనీలు వ్యాపారస్తులను మోసం చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఆయిల్ ట్యాంక్ ట్రంక్ టాంకర్స్ లోడింగ్ లో 80 కేజీల నుంచి 100 కేజీలు 120 కేజీల వరకు ఆయిల్ షార్ట్ ఏజ్ వస్తున్నాయని పేర్కొన్నారు.ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ….. కంపెనీలను ఇదేమని మేము ప్రశ్నించగా మీరు మీ బ్రోకర్ ద్వారా మెయిల్ పెట్టండి మేం చూస్తాం అంటున్నారు కానీ చూడరు బ్రోకర్లు పలమార్లు మెయిల్ పెట్టినప్పటికీ పట్టించుకోవడం లేదు అని అన్నారు.ఒక లారీకి 100 కేజీలు అంటే 13000 రూపాయలు ఇలా ఆయిల్ తక్కువ రావడంతో ప్రతి ట్యాంకర్ ఓనర్లు నష్టపోతున్నారు అని అన్నారు.వేల కోట్లు వ్యాపారస్తులు ప్రభుత్వానికి టాక్స్ చెల్లిస్తున్న ఈ కంపెనీ మీద నిఘ పెట్టకపోవడం చాలా ఆశ్చర్యం ఉంది అని అన్నారు.తూనికల, కొలతలు శాఖ,విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ అయినా ఎవరు పట్టించుకోలేదు అని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కి, ఉప ముఖ్యమంత్రి కి ఆధారాలతో లేఖ రాయడం జరిగింది అని అన్నారు.ఒక రోజుకి కొన్ని వందల ట్యాంకర్లు కృష్ణపట్నం పోర్టుకు వస్తుంటాయి లక్షల రూపాయలు కంపెనీ వాళ్ళు మోసం చేయడం జరిగిపోతుంది అని అన్నారు. ఈ అన్యాయాన్ని జిల్లా యంత్రాంగం అరికట్టవలసిన కొరడమైనది అని అన్నారు.పదిరోజులకు ఒకసారైనా సంబంధిత శాఖ అధికారులు కంపెనీలలోకి వెళ్లి ఈ సమస్యలు పరివేక్షించాలి అని కోరుతున్నాము అని అన్నారు.ఈ సమస్యను జిల్లా కలెక్టర్కు జిల్లా యంత్రాంగానికి తెలియజేశాము అని అన్నారు. అసలు ఆఫీసర్లు కంపెనీలకు వెళ్లి చెక్ చేస్తుంటే ఇలాంటి మోసాలకు తావు లేకుండా ఉంటుంది అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *