శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్)
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో ముప్పిడి చిన్న ఏసుబాబు ఇటీవల కాలంలో అకాల మరణం చెందారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖములో ఉన్న ఆ నిరుపేద కుటుంబాన్ని సోమవారం పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి 5000 రూపాయలు ఆర్థిక సాయం ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ఎం ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు అందజేసారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించి ధైర్యపరిచారు.ఈ కార్యక్రమంలో పోతులూరు సర్పంచ్ బొండి రాంబాబు, శెట్టి సత్తిబాబు ఎంపీటీసీ ముప్పిడి ఏసుబాబు, నాగేశ్వరరావు, ఎలుగుబంటి బాడ్జి, చెక్కపల్లి బుజ్జిబాబు మాజీ ఉప సర్పంచ్ పంచాది చంటిబాబు చెక్కపల్లి బాడ్జి10 Proచెక్కపల్లి,మాజీ ఎంపీటీసీ రేఖ కృష్ణ రేఖ రాంబాబు కోలా అప్పారావు,బొండి బాబ్జీ, మాది నాగేశ్వరరావు, మాది సత్తిబాబు, శ్రీపతి నాగేశ్వరరావు, కోలా తాతబాబు , బొల్లు నాగేశ్వరరావు, ముప్పిడి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







