టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించిన టిడిపి నేత పర్వత సురేష్..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ఈకాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలోని కృష్ణాలయం వీధిలో గల విజయ కనకదుర్గ అమ్మవారి పీఠం లో సుమారు గడిచిన 20 ఏళ్లుగా భక్తులు నిత్య పూజలు అందుకుంటున్నారు. అమ్మవారికి శాశ్వత ఆలయం నిర్మాణంకై ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్, శంఖవరం ఉప సర్పంచ్ చింతనీడి కుమార్, ఆలయ నిర్మాణ కర్త కారుకొండ శ్రీను చేతుల మీదుగా సోమవారం భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే సత్య ప్రభ రాజాకు టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్, అమ్మవారి భక్తులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నేతలు బొర్రా వాసు, జట్లా శ్రీను, దాసరి రాకేష్, కొల్లుబోయిన రాజు, ఇసరపు వరప్రసాద్, ఇసరపు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.