
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్;ఏలేశ్వరం
నగర పంచాయతీ పరిధిలో లింగవరం కాలనీ,నాలుగో వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బిజెపీ పట్టణ బిజెపి నాయకులు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సత్య కంటి ఆసుపత్రి వారిచే మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టెం వెంకటరమణ,టౌన్ ఇంచార్జ్ రెడ్డి లావరాజు లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని, ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారని,20 ఆపరేషన్ నిమిత్తం కంటి ఆసుపత్రికి పంపించడం జరిగిందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కే విజయ్ కుమార్, వాడపల్లి చిన్నబాబు,రెడ్డి వరలక్ష్మి, ఎర్ర శైలజ,రాతికింద కృష్ణారావు, ప్రకాష్, జి శ్రీనివాస్, దుర్గ, వైద్యులు టి రాము,వైద్య సిబ్బంది ప్రసాద్, సరిత,కుమారి తదితరులు పాల్గొన్నారు









