- ప్రజల పురోగతినే లక్ష్యంగా పెట్టుకున్న కుటుంబం గల్లా కుటుంబం.
- గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.
తవణంపల్లి సెప్టెంబర్ 29 మన ధ్యాస
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, దిగువమాఘంలో నూతన కమ్యూనిటీ హాల్‌ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. సోమవారం ఉదయం దిగువమాఘం దళితవాడలో ప్రజల సౌకర్యార్ధం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ నిధులతో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్ ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి కమ్యూనిటీ హాల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతకుముందు దిగువమాఘం గ్రామానికి చేరుకున్న వీరికి మండల నాయకులు, స్ధానిక ప్రజలు దుశ్శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్ధానిక ప్రజలతో ముచ్చటించి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పధకాలను వివరించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రసంగిస్తూ… దళితవాడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల పురోగతి కోసం నిరంతరం కృషి చేస్తూ నడిచే కుటుంబం గల్లా కుటుంబం అని తెలిపారు. శ్రమను నమ్మి జీవించాలనే వారి విశ్వాసం ప్రజల సంక్షేమంలో గల్లా కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ప్రజల సౌకర్యం కోసం అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తున్నామని, గల్లా జయదేవ్ నిధులు కేటాయించి ఈ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ హాల్ ద్వారా దళితవాడ ప్రజలకు మేలు చేస్తుందని ఆయన తెలియజేశారు. అనంతరం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగిస్తూ… ప్రజల అవసరాలు తీర్చడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందన్నారు. దిగువమాగం దళితవాడలో కమ్యూనిటీ హాల్ అవసరం ఉందని తెలిసిన వెంటనే నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ హాల్ ద్వారా గ్రామ ప్రజలు సామూహికంగా జరిగే కార్యక్రమాలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్ యాదవ్, బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, మాజీ మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, అరగొండ రంజిత్ రెడ్డి, నాయకులు ప్రవీణ్ కుమార్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, స్ధానిక ప్రజలు పాల్గోన్నారు.








