డి ఎఫ్ ఎస్ క్యాంపు లతో గ్రామాల్లో ఆర్థిక చైతన్యం…

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

శంఖవరం/డి.పోలవరం మన ధ్యాస ప్రతినిధి:- బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే లక్ష్యంతో డి ఎఫ్ ఎస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి పోలవరం బ్రాంచ్ మేనేజర్ ఈశ్వరరావు గారు అన్నారు. జూలై 1వ తేదీ నుంచి మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) స్యాచురేషన్ క్యాంపు కార్యక్రమం కాకినాడ జిల్లా దీపోలవరం గ్రామంలో స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత సమర్థవంతంగా చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్, యూనియన్ బ్యాంక్ సమన్వయంతో నిర్వహిస్తోంది.ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఈశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు అందని వర్గాలకు సేవలు చేరువ చేయడం, ఇప్పటివరకు ఖాతా లేని వారికి కొత్త ఖాతాల ఓపెనింగ్, తేలికపాటి కారణాలతో నిలిచిపోయిన (inactive) అకౌంట్లను తిరిగి యాక్టివ్ చేయడం, పీఎం ఎస్బీవై (PM-SBY), పీఎం జెజెబీవై (PM-JJBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి కేంద్ర ప్రభుత్వ బ్రహ్మ పథకాలపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియ జరగడం వంటి కార్యక్రమాలు అమలయ్యాయి.కాకినాడ జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీల్లో ఈ డిఎఫ్‌ఎస్ క్యాంపులు మూడు నెలల పాటు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ పరిధిలోగల అన్ని బ్యాంక్ బ్రాంచ్ లలో ప్రతి శుక్రవారం ఈ స్యాచురేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు డిఎఫ్‌ఎస్ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులు ద్వారా గ్రామస్తుల బ్యాంకింగ్ అవసరాలపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అంతేకాకుండా జనదన్ (pmjdy) ఖాతాదారులు ఇతర ఖాతాదారులు రీకేవైసీ( re kyc), నామిని అప్డేట్ చేయించుకోవాలని తెలిపారు .అన్ని బ్యాంకుల సహకారంతో వివిధ గ్రామాల్లో క్యాంపులు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. అనంతరం ఇటీవల కాలంలో నల్లా ఆదినారాయణమ్మ ప్రమాదవశాస్తు మరణించగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం లో రెండు లక్షల రూపాయల చెక్కును,. బొడ్డు నూకరత్నం అనే మహిళ అనారోగ్యం సంభవించడంతో మరణించగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా రెండు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలు పలక సోమేశ్వరరావు, తుని సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు రమణ బాబు, రాజేశ్వరి చేతుల మీదుగా అందజేశారు.ఈ క్యాంపులో యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఈశ్వరరావు మరియు వెలుగు సిసి సత్యనారాయణ . డ్వాక్రా యానిమేటర్లు రైతులు . మహిళ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!