ఏ పి జి బి మేనేజర్ ఆనందరావు…

శంఖవరం/కిర్లంపూడి మన ధ్యాస ప్రతినిధి: బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి వ్యక్తి బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ ఆనందరావు తెలిపారు. మండలంలోని కృష్ణవరం గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామస్థాయి జన సురక్ష శాచు రేషన్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఏపీజీబీ సోమవారం బ్రాంచ్ మేనేజర్ ఆనంద్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ పద్ధతులు మరియు రీ-KYC ప్రాముఖ్యతపై వివరించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలను సమయానికి రీ-KYC చేయించుకోవాలని, తద్వారా లావాదేవీలలో ఎటువంటి అంతరాయం లేకుండా సులభంగా సేవలు పొందవచ్చని సూచించారు.సామాజిక భద్రతా పథకాలైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) గురించి వివరించబడింది. గ్రామ ప్రజలు ఈ పథకాలపై ప్రశ్నలు అడగగా, అధికారులు వాటి ప్రయోజనాలను, చేరిక విధానాన్ని వివరించారు. KYC సౌకర్యం కోసం గ్రామానికి సమీపంలో ఉన్న బ్యాంక్ కరస్పాండెంట్ (BC) పాయింట్లలో కూడా సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీంతో గ్రామస్థులకు సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకోవచ్చని వివరించారు. సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్ వై వెంకట్రావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత కేవలం వ్యక్తిగత ప్రయోజనానికి మాత్రమే కాకుండా, కుటుంబం మరియు సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలియజేసి, అందరూ డిజిటల్ బ్యాంకింగ్, భద్రతా చర్యలు మరియు ప్రభుత్వ పథకాల సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి ఓ ఏ లు, గ్రామస్థాయిలోని స్వయంసహాయక సంఘాల మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *