వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. శంఖవరం మండలం మండపం గ్రామంలో గిరిబాబు పర్యటించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కూని శెట్టి మాణిక్యం నివాసంలో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. నూతనంగా నియమితులైన గ్రామ కమిటీ అనుబంధ విభాగాల సభ్యులను అభినందించారు. గిరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధి పేరుతొ ప్రచారం చేయడం తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజలు గిరిబాబు దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో రహదారుల అద్వానంగా ఉన్నాయని ప్రభుత్వం దృష్టి సారించి రహదారులు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకునేలా అధికారులకు తెలియజేయాలని గిరిబాబును కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఈగలఅప్పారావు, నరాల శ్రీను, రామిశెట్టి ఏసుబాబు, నక్కా బాజ్జి, సకురు గుర్రాజు, అడపా సోమేశ్, సప్పా అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *