

మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 25 :*మా ప్రభుత్వం వచ్చాక అన్యాయాలు, అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టాం.*ఎవరైనా పొరపాట్లు చేసినా సరికాదని మందలిస్తాం.*మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు వేదాయపాళెంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నేతలకు కండువాలు కప్పి టీడీపీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.మన్నారపు రఘురామయ్య, పొట్టేళ్ల ప్రసాద్, మోడిబోయిన వెంకట్రామయ్య, పలగాని శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారిలో వీరంపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు తురిమెర్ల రఘురామిరెడ్డి, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు తాటిపర్తి రాఘయ్య, పంచాయతీ వార్డు సభ్యుడు పలగాని శేషురెడ్డి, ముఖ్య నాయకులు తురిమెర్ల మస్తాన్ రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మీ నరసారెడ్డి, దగ్గవోలు రామచంద్రారెడ్డి, పలగాని పుష్యంత్ రెడ్డి, పంట మనోహర్ రెడ్డి, జెట్టి ఆదినారాయణ రెడ్డి, సునీల్ రెడ్డి, యద్దలపూడి సుబ్రహ్మణ్యం .మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన ముఖ్య నాయకులు టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.వైసీపీ మండల ఉపాధ్యక్షుడు, వీరంపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు తురిమెర్ల రఘురామిరెడ్డి, ఎంపీటీసీ తాటిపర్తి రాఘయ్య, వార్డు సభ్యులు పలగాని శేషురెడ్డితో పాటు 13 మంది ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు.గత ఎన్నికల్లో వీరంపల్లిలో నాకు 300కి పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది…వీరి చేరికలతో టీడీపీ మరింత బలోపేతమవుతుంది అని అన్నారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదు మండలాల పరిధిలో టీడీపీ ఘనవిజయం సాధించేలా బలోపేతం చేసుకుంటున్నాం అని అన్నారు.మేం అధికారంలో ఉన్న సమయంలో చీమకు సైతం అన్యాయం జరగనివ్వం..చేతనైతే సాయం చేస్తాం..లేదంటే సర్దిచెబుతాం అని అన్నారు.వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక అరాచకాలు జరిగాయి..అమాయకులు ఆస్తులు కోల్పోయారు..పూల తోటలు ఎండబెట్టుకున్నారు..భూములు బీడు పెట్టుకున్నారు…రొయ్యల గుంతలు తెగ్గొట్టడంతో కోట్ల రూపాయలు నష్టపోయిన వారు కూడా ఉన్నారు అని అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్యాయాలు, అక్రమాలకు పుల్ స్టాప్ పడింది..వ్యవస్థలన్నీ గాడిలో పడుతున్నాయి అని అన్నారు.రీసర్వే పేరుతో భూముల రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేశారు..ప్రధానంగా టీడీపీ సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకుని రికార్డుల్లో పేర్లను తొలగించడం, విస్తీర్ణం తగ్గించడం, 22ఏలో పెట్టడం చేశారు అని అన్నారు.ఆ లోపాలన్ని సరిదిద్దేందుకే చాలా సమయం పడుతోంది అని అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరులో ఎకరా రూ.2.50 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూముల రికార్డులతో గుడ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో కూర్చుని మార్చేశారు అని అన్నారు.రామదాసుకండ్రిగలో 57 ఎకరాలు, మరుపూరులో 57 ఎకరాలు, సూరాయపాళెంలో 36 ఎకరాలను, కొమ్మలపూడిలో 19.20 ఎకరాలు, సర్వేపల్లిలో 6.30 ఎకరాలు, వావిలేటిపాడులో 4.20 ఎకరాలు కాజేశారు అని అన్నారు.ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉందని వైసీపీ నాయకుల భూములు లాక్కుని మా పార్టీ వాళ్లకు ఇస్తామా అని అన్నారు.ఎవరైనా పొరపాట్లు చేసే ప్రయత్నం చేసినా సరికాదని మందలిస్తాం…కానీ ప్రోత్సహించం అని అన్నారు.


