

నవరాత్రులు వినాయక మండపాలన్నీ కళకళలాడాలి… ఎమ్మెల్యే కాకర్ల సురేష్
ఉదయగిరి, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 26 ://///
ఉదయగిరి నియోజకవర్గం యావత్ ప్రజానికం.. కూటమి శ్రేణులకు మనందరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అందరూ గణపతి నవరాత్ర మహోత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజానీకానికి మనందరి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియచేస్తూ సందేశాన్ని విడుదల చేశారు.ఆయురారోగ్యాలతో అందరూ క్షేమంగా ఉండాలని గణనాథుడిని వేడుకుంటున్నానన్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజానికం మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే పనులకి విఘ్నాలు తొలగి, దిగ్విజయం అయ్యేందుకు ప్రధమ పూజ్యుడు వినాయకుడు ఆశీస్సులు అందించాలని ఆయన ఆకాంక్షించారు.తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నవరాత్రులన్నీ రోజులు వినాయక మండపాలు కళకళలాడాలన్నారు. విఘ్నాలను అధిగమించి, రాష్ట్రం పురోగమనం సాధిస్తుందని ఆకాంక్షించారు.