

మన న్యూస్: మణుగూరు, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మణుగూరు అభివృద్ధి అదొగతి పాలు అయిందని, పంచాయతీగా ఉన్న మణుగూరును మున్సిపాలిటీ చేసి సర్వనాశనం చేశారని.. దీనికి పూర్తి బాధ్యత గత పాలకులదేనని మణుగూరు కూ చెందిన సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆరోపించారు. గత పాలకులైన మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు కానీ, ప్రస్తుత శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గాని ఈ విషయమై మణుగూరును పంచాయతీ చేయాలన్న ఇంకిత జ్ఞానం లేదని వారికి పదవులపై తప్ప ప్రజా పాలనపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. వామపక్ష పార్టీలు సైతం ఆ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు తోకల్లాగ మిగిలిపోతున్నాయా తప్ప మణుగూరును పంచాయతీ చేయాలని డిమాండ్ చేసిన పాపాన పోలేదన్నారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా మణుగూరును మున్సిపాలిటీ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ, మణుగూరును పంచాయతీ చేయాలని డిసెంబర్ 05 న స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ప్రజా అభిప్రాయ సంతకాల సేకరణ చేసి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి, గవర్నర్ కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి అందజేయడం జరుగుతుందని కర్నె రవి తెలిపారు.