

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ లో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయ ప్రదీప్ కోరారు.ఈ మేరకు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ జీఎం,డియం ను సోమవారం గ్రామస్తులతో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన ప్రదీప్ మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ఎన్నికల సమయంలో వాగ్ధానం చేశారన్నారు. ఎంపీ ఆదేశాల మేరకు టవర్ ఏర్పాటు కోసం వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.సాద్యమైనంత తొందరగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఆయన వెంట నాయకులు వెల్లుట్ల నగేష్, రాములు తదితరులు ఉన్నారు.