ఆడండి… పోరాడండి ….గెలవండి ….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం, ఆగస్టు 23: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఈషా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. – మహా శివరాత్రి సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఘనత ఈషా ఫౌండేషన్ వారిదే. – సామాజిక, ధార్మిక రంగాలలలో ఈషా ఫౌండేషన్ కృషి అభినందనీయం. – కోయంబత్తూరులో జరిగే ఫైనల్స్ లో కోవూరు నియోజకవర్గ క్రీడాకారులు విజయ పతాకం ఎగుర వేయాలి. – ఈషా ఫౌండేషన్ రూరల్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. మన ధ్యాస, బుచ్చిరెడ్డిపాలెం ,ఆగస్టు 23:ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా రంగాలలో ఈషా ఫౌండేషన్ వారు అందిస్తున్న సేవలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రశంసించారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని డి ఎల్ ఎన్ ఆర్ హైస్కూల్ గౌండ్స్ లో ఈషా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం పేరుతొ నిర్వహిస్తున్న “వాలి బాల్” “త్రో బాల్” జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈషా ఫౌండేషన్ వారు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. రెండు రోజుల పాటు జరిగే “వాలి బాల్” “త్రో బాల్” జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ పోటీలలో జిల్లా నలు మూలల నుంచి దాదాపు 40 జట్లు పాల్గొంటున్నాయన్నారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి సెప్టెంబర్ 21 న కోయంబత్తూరులో జరిగే ఫైనల్స్ లో విజయ పతాకం ఎగుర వేయాలని క్రీడాకారులకు ఆశీస్సులు అందచేశారు. యోగా, ధ్యానం లాంటి సాంప్రదాయ సదాచారాలకు ప్రపంచ ప్రాచుర్యం కల్పించడంతో పాటు దేశీయ క్రీడా, వైద్య మరియు వ్యవసాయ రంగాలలో సేవలందిస్తున్న ఈషా ఫౌండేషన్ సేవలను ఆమె కొనియాడారు. ఏటా శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో నిర్వహించే జాగరణ వేడుకలు భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలన్నారు. సమాజాన్ని సన్మార్గాన్ని బోధించే సద్గురు జగ్గీ వాసుదేవన్ బోధనలు నిరాశ, నిసృహలో వున్న వారికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. సామాజిక చైతన్యానికి ప్రేరణ కల్గించే సద్గురు బోధనలు యువత సన్మార్గంలో నడిచేందుకు దోహద పడుతాయన్నారు. సద్గురు బోధనలతో తాను సైతం స్వాంతన పొందుతానన్నారు, ఆడండి పోరాడండి గెలవండి ఓటమిలో సైతం విజయాన్ని ఆస్వాదించండి అంటూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. గెలవాలన్న ధృడ సంకల్పమే విజయం వైపు నడిపిస్తుందన్నారు. యువత జీవితంలో నైరాశ్యాన్ని వీడి విజయం వైపు అడుగులు వేయాలని హితోపదేశం చేశారు. ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ లేదని ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని విజయానికి కావాల్సింది కృషి పట్టుదల మాత్రమేనన్న సందేశాన్ని యిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్లు శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, టిడిపి మండల అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, టిడిపి నాయకులు టంగుటూరు మల్లారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి మండల క్లస్టర్ ఇంచార్జిలు పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు