

వింజమూరు మన న్యూస్ ప్రతినిధి నాగరాజు :///
ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు శుక్రవారం రాత్రి నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు, సభ్యులు, జాబితా లో వింజమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, గని శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి సహకారంతో ఎన్నికైనందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసి, శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, యారవ కృష్ణయ్య నాయుడు, చల్లా శ్రీనివాసులు యాదవ్, కే శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి నాయుడు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, రామ్మోహన్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.