

మన న్యూస్,ప్రతినిధి నాగరాజు, ఆగష్టు 21 నెల్లూరు ://:
నెల్లూరు జిల్లా వైసీపీ పెద్దలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆయన యొక్క స్వగృహంలో వైఎస్ఆర్సిపి మూడవ డివిజన్ ఇంచార్జ్ అక్కల రెడ్డి నారాయణ. రెడ్డి మరియు 9వ డివిజన్ ఇంచార్జ్ ధనూజ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా పరిధిలోని రాజకీయ అంశాలపై చర్చించి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మేకపాటి కుటుంబం అందుబాటులో ఉంటూ తన యొక్క పూర్తి సహాయ సహకారాలు అన్ని వేళల అందిస్తూ ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. వారి వెంట ఎంపీటీసీ అక్కల రెడ్డి కొండారెడ్డి, దశరధి రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, నాగరాజు మరియు సుబ్బయ్య పాల్గొన్నారు.