

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహ్మద్ నగర్:
పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగబోయే పి ఆర్ టి యు మహాధర్నాను విజయవంతం చేయాలని పి ఆర్ టి యు టీ యస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో మహ్మద్ నగర్ మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు కలకొండ నారాయణ మాట్లాడుతూ..ఉపాధ్యాయుల పెన్షన్ హక్కులను సాధించేందుకు అందరూ ఒక్కటై మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకటరమణ,రాష్ట్ర కార్యదర్శి నగేష్,మండల అసోసియేట్ అధ్యక్షులు పండరి,ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట్ రాం రెడ్డి, ఉపాధ్యాయులు భద్రయ్య, స్వరూప,వినోద,శోభ,మేఘన తదితరులు పాల్గొన్నారు.