మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నవ భారత నిర్మాత,మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా మార్చిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ పేర్కొన్నారు.యువత రాజకీయాల్లోకి రాబోయేలా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ఆయన తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని గుర్తుచేశారు.నేడు భారత్‌ ఏఐ, టెక్నాలజీ రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నదంటే దానికి పునాది రాజీవ్ గాంధీ విజన్ అని అన్నారు.దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని, వారు చేసిన సేవలను స్మరించుకోవాలని సూచించారు.రాజీవ్ గాంధీ ఆశయాలను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రిగా చూడటమే కాంగ్రెస్ కార్యకర్తల ధ్యేయమని,ఇందుకోసం ప్రతి నాయకుడు,కార్యకర్త, ముఖ్యంగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *