

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 12:- పార్వతీపురం మన్యం జిల్లా, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు మండలంలో గల ఎరువుల దుకాణాలను పాచిపెంట మండల తహసిల్దార్ డి రవికుమార్,వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళవారం నాడు తహసిల్దార్ రవికుమార్, వ్యవసాయ శాఖ అధికారి తిరుపతిరావు పాచిపెంట గురువు నాయుడుపేట గ్రామాలలో గల ఎరువులు దుకాణాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎరువుల డీలర్లకు పలు సూచనలు జారీ చేశారు.లైసెన్స్ తప్పకుండా షాపుల్లో ప్రదర్శించాలని ఆధీకృత కంపెనీల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేసి మండలంలో ఉన్న రైతులకు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు.బిల్లు బుక్కులు, ఇన్వాయిసులు,రిజిస్టర్లు పక్కగా నిర్వహించాలని సూచించారు.నాణ్యమైన ఎరువులను మాత్రమే విక్రయించాలని రైతులకు ఎరువులు విక్రయించేటప్పుడు ముఖ్యంగా యూరియా కొనుగోలు చేసే వ్యక్తుల వచ్చేటప్పుడు అధిక యూరియా వాడటం వలన కలిగే నష్టాలను తెలియజేయాలన్నారు. నానో యూరియా ఉపయోగాలను కూడా రైతులకు తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా కృష్ణ ఎరువులు డిపో బూర త్రినాధ రావు ఎరువులు డిపో,గురువు నాయుడుపేటలో ఉన్న బంగారమ్మ ఎరువులు డిపో పరిశీలించారు.గ్రామ వ్యవసాయ సహాయకులను ఉద్దేశించి ఎరువులు కొరత ఉన్నది లేనిది తెలుసుకొని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తామని తెలిపారు. ప్రస్తుతం వరి పంటకు ఎరువులు అవసరం ఉన్నాయని మొక్కజొన్న మరియు పత్తి పంటలకు దాదాపు ఎరువుల విక్రయం పూర్తి చేయబడిందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
