

గూడూరు, మన న్యూస్ :- ఎవరైనా గాంజా మత్తు పదార్థాలు కలిగి ఉన్న లేక రౌడీయిజంకి పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గూడూరు డి.ఎస్.పి గీత కుమారి హెచ్చరించారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోమవారం గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ గూడూరు పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల ఓ మెడికల్ షాపులో గాంజా లభ్యం కావడం దానిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఈ గాంజా మెడికల్ షాపు యజమానికి ఎటువంటి సంబంధం లేదని ఇందులో ప్రధాన నిందితుడు నయీంగా ఆమె పేర్కొన్నారు. మెడికల్ షాప్ యజమానికి నయీమ్ కి మధ్య ఉన్న విభేదాలు కారణంగా అతనిని కేసులో ఇరికించా లన్న నేపద్యంలో నయీమ్ తన సన్నిహితుల ద్వారా గాంజా అక్కడ ఉంచి సమాచారం ఇవ్వడంతో మెడికల్ షాప్ యజమానిదేనని భ్రమపడ్డామని అన్నారు తీరా విచారణ జరిపిన తర్వాత ఈ ఘటనకు బాధ్యుడిగా తేలింది అన్నారు. అలాగే ఎవరైనా గాంజా మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి వాటి కలిగి ఉంటే అవి వాటి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన రౌడీయిజం చేసిన వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా ఫోన్ ద్వారా బెదిరించిన మోసపోవద్దని ఆమె సూచించారు. తమ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందన్నారు. అలాగే ఇకపై తమకు అనుమానం ఉన్న ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలియజేశారు. ఎమ్మెల్యే పోలీసులపై చేసిన అసహనం గురించి ప్రస్తావించగా తాము నిబద్ధతతో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఒకటో పట్టణ సీఐ శేఖర్ బాబు పాల్గొన్నారు.