చవితి ఉత్సవాలకు పోలీసులు అనుమతి తప్పనిసరిగూడూరు డిఎస్పీ గీత కుమారి

గూడూరు, మన న్యూస్ :- గణేష్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ట మరియు నిమజ్జనం కొరకు పోలీస్ వారి అనుమతులు తప్పనిసరి గా ఉండాలని, వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం మరియు మండపాలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా పోలీసు వారి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని గూడూరు డిఎస్పి గీతా కుమారి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో దైవ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అదేవిధంగా కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవాల సందర్భంగా అనుసరించవలసిన మార్గదర్శకాలు మరియు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. గణేష్ నవరాత్రి వేడుకలను నిర్వహించాలనుకునే వారు తొలుత ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ అన్ని కార్యకలాపాలకు పూర్తి బాధ్యత వహించాలి.విగ్రహాలు ప్రజా స్థలాల్లో ప్రతిష్టించాలి అనుకునే వారు స్థానిక పంచాయతీ నుండి అనుమతి పొందాలి .గణేష్ విగ్రహాలు వ్యక్తిగత స్థలంలో పెట్టాలనుకునే వారు ఆ స్థలం యజమాని నుండి అనుమతి తప్పనిసరిగా పొందాలి. విగ్రహాల ఏర్పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదు లేదా ట్రాఫిక్‌ను అంతరాయం కలిగించకూడదు. మైక్రోఫోన్‌లు మరియు ధ్వనివ్యవస్థలనువినియోగించడానికి సంబంధిత పోలీస్ స్టేషన్ అగ్నిమాపక విద్యుత్ శాఖ నుండి ముందస్తుగా అనుమతి పొందాలి. ధ్వని ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. రాత్రి 10:00 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. మండపాలల్లో హుండీలు లేదా విలువైన వస్తువులు ఉన్నట్లయితే, ఆ కమిటీ పూర్తి బాధ్యత వహించాలి. సీసీటీవీ కెమెరాలు ఆ ప్రదేశంలో ఏర్పాటు చేయాలి.విద్యుత్ కనెక్షన్ల కోసం విద్యుత్ శాఖ నుండి అనుమతి పొందాలి అన్ని లైటింగ్ మరియు ఎలక్ట్రికల్ ఏర్పాట్లు షార్ట్ సర్క్యూట్‌లను నివారించేలా తగు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాటు చేయాలి. ఇతర మతాల ప్రజలకు లేదా వారి పూజాస్థలాలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎలాంటి గొడవలు జరుగకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలి. ఎవరైనా బలవంతంగా విరాళాలు సేకరిస్తే, కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటారు. ఊరేగింపు మరియు నిమజ్జనం కార్యక్రమాల సమయంలో మద్యం సేవించడం మరియు ప్రజా శాంతి భగ్నం చేసే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టకూడ దన్నారు. అలా పట్టు బడిన వారికి కఠిన చర్యలుతీసుకుంటా మన్నారు.ఊరేగింపు తేదీని ముందుగానే పోలీసులకు తెలియజేయాలి. ఊరేగింపులో ఉపయోగించే వాహనాలు మరియు డ్రైవర్లు యొక్క వివరాలు, వారి ఆధార్ కార్డు ప్రతులతో కలిసి పోలీసులకు సమర్పించాలి.గ్రామాలలో వివిధ మార్గాల్లో మండపాల ఏర్పాటు గురించి పోలీసులకు సమాచారం అందించడం తప్పనిసరి, మరియు పై నిబంధనలను పాటించాలి. ఈ విషయాన్ని పబ్లిక్ నోటరీ ద్వారా ధృవీకరించిన ప్రకటనను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమర్పించాలి.ప్రజలు వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో మరియు శాంతియుతంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, అలానే సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో అసభ్యకరమైన లేదా అనైతిక ప్రదర్శనలు ఆడవారి డాన్సులు నిర్వహించరాదని తెలియజేస్తూ..ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..