గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్
ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ వారి పర్యవేక్షణలో రాపూరులోని షాదీ మంజలీ ఆవరణలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారామ నాయుడు మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ శ్రీవిద్య డాక్టర్ నీలిమ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం‌ జరిగింది అన్నారు. నెల్లూరు తిరుపతి జిల్లాలలోని ప్రతి మండల కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉచితంగా మందులు కంటి అద్దాలు ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం లో 200 మందికి పరీక్షలను ఉచితముగా నిర్వహంచి 60 మందికి ఉచితముగా మందులు పంపిణీ 45 రోగులకు ఉచిత కంటి అద్దాలు, 60 మందికి ఉచితంగా ఆపరేషన్ లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో కృష్ణ గల్లా, అరవింద్ నేత్రలయ సిబ్బంది దిలీప్ , రాపూర్ షాదీ మంజిల్ సభ్యులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *