మధ్యాహ్న భోజన వర్కర్లకు అవగాహన సదస్సు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు శనివారం కొత్తగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. వెంకటేశ్వరాచారి అధ్యక్షతన ఆనందఖని యందు అవగాహన సదస్సు నిర్వహించడమైనది ఇట్టి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మధ్యాహ్న భోజనం వంట చేసే గ్రూప్ సభ్యులు తప్పనిసరిగా సుచి, శుభ్రత, పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు వంట చేయుటకు ముందుగానే కాళ్లు చేతులు పరిశుభ్రంగా కడగాలని తలకు టోపీ ధరించి పరిశుభ్రమైన వాతావరణం లో మాత్రమే పాఠశాల ఆవరణలో మాత్రమే భోజనం వండాలని సూచించడం జరిగినది. పాఠశాలకు వచ్చిన బియ్యం ముందుగానే శుభ్రపరుచుకుని ఒక మంచి శుభ్రమైన డబ్బాలో పోసుకొని శుభ్రమైన నీటితో మాత్రమే వంట చేయాలని ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే పై అధికారులకు తెలియజేయాలని సూచించడం జరిగినది. వంటకు ఉపయోగించే కూరగాయలు సాధారణంగా మునగాకు, కరివేపాకు, చింతాకు స్వయంగా పండించినదైతే చాలా మేలని పిల్లలకు బలాన్ని చేకూరుస్తాయని బయట షాప్ ల ద్వారా తీసుకువచ్చే కూరగాయలు శుభ్రమైన నీటితో కడగాలని అందులో పుచ్చులు పురుగులు పట్టినయ లేదా జాగ్రత్తగా చూసి వండాలని పిల్లలకేదైనా అనర్ధం జరిగినట్లయితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆరోగ్యం బాగోలేని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి భోజనం అందించాల్సిన అవసరం ఉంటేనే అందించాలని లేనియెడల ఉపాధ్యాయులకు విషయం తెలియపరిచి ఇంటికి పంపించేయాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి .వెంకటేశ్వర చారి,జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, ఎఫ్ఏఓ శ్రీనివాస్ కొత్తగూడెం మండల విద్యాధికారి యం. ప్రభుదయాళ్ చుంచుపల్లి మండల విద్యాధికారి బి.బాలాజీ, లక్ష్మీదేవిపల్లి పి.కృష్ణయ్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.