

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, తొమ్మిది నెలలు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన 78 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో సమావేశమైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిది నెలల పాటు బేసిక్ ట్రైనింగ్ ను పూర్తి చేసుకొని జిల్లాలో విధులను నిర్వర్తించడానికి కేటాయించబడిన 78 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.ఇందులో 28 మంది సివిల్ కానిస్టేబుళ్ళు (పురుషులు),17 మంది ఉమేన్ కానిస్టేబుళ్ళు,25 మంది ఏఆర్కా నిస్టేబుళ్ళు(పురుషులు),08 మంది ఏఆర్ ఉమేన్ కానిస్టేబుళ్ళు మొత్తం 78 మంది రిపోర్ట్ చేయడం జరిగింది.వీరితో సమావేశమైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ,నిజాయితీతో విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలలో పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంచుకొని సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.మానసికంగా,శారీరకంగా దృఢంగా ఉంటూ,ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ బాధ్యతగా తమ యొక్క కేటాయించిన విధులను నిర్వర్తించాలని తెలిపారు. విధులు పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.నీతి,నిజాయితీతో పనిచేసే వారికి పోలీస్ శాఖలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు.కష్టపడి సాధించిన ఉద్యోగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఉన్నత స్థాయికి చేరాలని తెలియజేసారు.ప్రస్తుతం పోలీస్ శాఖలో వినియోగిస్తున్న సాంకేతికతపై అవగాహన పెంచుకుని దానికనుణంగా పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
