

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బిడ్డ పుట్టిన మొదటి గంటలోపల ముర్రుపాలు ఇవ్వాలని పాచిపెంట ఐసిడిఎస్ పిఓ బి అనంతలక్ష్మి కోరారు. శుక్రవారం నాడు మండలం రాయగడ్డివలస పంచాయతీ సరాయి వలస, గురువు నాయుడుపేట పంచాయతీ గొలుగువలస గ్రామాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించారు. బిడ్డకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు పట్టించడం వలన తల్లికి బిడ్డ కలిగే ప్రయోజనాల గురించి అంగన్వాడీ కార్యకర్తలకు అక్కడికి వచ్చిన గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమన్నారు. తరువాత పరిసరాలు పరిశుభ్రత పై దృష్టి సారించాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు విధిగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సక్రమంగా వేళలు పాటించాలని సూచించారు. అందరూ కలిసి తల్లి పాల వారోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.పై కార్యక్రమానికి సూపర్వైజర్ ఇందిర, మిగతా సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.
