సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్ ?

మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ : అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సైతం బరిలో నిలిచి తమ సత్తా ఏమిటో మరోసారి చూపిస్తామంటూ యువత ముందుకొస్తున్నారు. వారితో రాజకీయం ఏమవుతుందని లైట్‌గా తీసుకునే రాజకీయ నేతలకు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో చాలామంది యూత్ సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ముందుకొస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు నేనంటే నేను బరిలో ఉన్నానంటూ లీకులిస్తున్నారు. ఆశావాహుల పేర్లు రోజు రోజుకి పెరిగిపోతుండటం హాట్ టాపిక్‌ మారింది. సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఆషామాషీ కాదని, జేబు బరువు చూసుకోవాలని, లక్షలు ఖర్చు చేస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తలపండిన వారు, మేధావుల సలహాలు సూచనలు తీసుకుంటూ రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు ఒక్కటే ఉంటే సరిపోదని, ప్రజల్లో మంచితనం, పలుకుబడి కూడా అవసరమని, అన్నింటికంటే ముఖ్యంగా ప్రజా సేవ చేయగలుగుతారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించిన వారికి ఖచ్చితంగా ప్రజలు వారికే పట్టం కడతారనే అభిప్రాయాన్ని మరికొందరు యూత్ వ్యక్తం చేస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో చాలామంది పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందన్న ఆసక్తితో ఉన్నారు. మరికొందరైతే ఏకంగా రహస్య ప్రాంతంలో మీటింగులు ఏర్పాటుచేసిన మందు, విందులతో దావతులు ఏర్పాటు చేసి సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు యూత్ ప్రధాన పార్టీల నేతల వద్దకు వెళ్లి వారిని ప్రసన్నం చేసుకుని వస్తున్నారు.
సర్కారు మారింది కాబట్టి… సర్పంచ్ స్థానానికి రిజర్వేషన్లు కూడా మారుతుండొచ్చన్న ప్రచారం జరుగుతుండటంతో, అందుకు తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. రిజర్వేషన్ మారితే పోటీలో నువ్వు ఉండాలని, మారకపోతే నేనే బరిలో ఉంటానంటూ పలువురు యూత్ ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒక్కో ఊరిలో సర్పంచ్ పదవికి పోటీ చేసే వారి సంఖ్య రెండంకెలకు చేరుకుంటుండటం తో ఈసారి పోటీ టఫ్ గా ఉంటుందని భావిస్తున్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///