

మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ కామారెడ్డిలో శుక్రవారం తలపెట్టిన బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమానికి ఉమ్మడి నిజాంసాగర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బొగ్గుగుడిసె కూడలి నుంచి కామారెడ్డికి వెళ్లారు. మాజీ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సాధుల సత్యనారాయణ, సీడీసీ మాజీ ఛైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు రమేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మనోహర్, విండో ఛైర్మన్లు వాజిద్ అలీ, నరసింహారెడ్డి,నాయకులు రాం చందర్, లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి,యటకరి నారాయణ,గరా బోయిన వెంకటేశం,గైని రమేష్,
కళ్యాణి విఠల్ రెడ్డి ఉన్నారు.