నానో ఎరువులుతో అధిక దిగుబడులు – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పోడు వ్యవసాయంలో బస్తా ఎరువుల కంటే నానో ఎరువులే బాగా పని చేస్తాయని మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు హితవు పలికారు.చిట్టెలుభ, శతాభి గిరిశిఖర గ్రామాలలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా నేలలో వేసే నత్రజని ఎరువులు 30 శాతం కు పైగా నీటి ద్వారా ఆవిరి ద్వారా వివిధ రూపాలలో నష్టపోయి పంటకు అందకుండా పోతుందని,పోడు భూములలో మట్టి సాంద్రత తక్కువగా ఉండడం వలన ఈ నష్ట స్థాయి మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. కాబట్టి పోడు మొక్కజొన్న పత్తి పంటలలో బస్తా ఎరువుల కంటే నానో ఎరువుల పిచికారి ద్వారా అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చని తెలిపారు. విచక్షణారహితంగా రసాయన ఎరువులు నేలలో వేస్తే రైతు మిత్రుడుగా పిలవబడే వానపాములు పూర్తిగా నశించిపోతాయని అలాగే గడ్డి మందులు పిచికారి ద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవులు పూర్తిగా నశించిపోతాయని దీనివలన సేంద్రియ పదార్థం క్రమంగా తగ్గిపోయి నేలలు నిస్సారం అయిపోతాయని కాబట్టి రైతులు పంట కొంచెం ఎదిగిన తర్వాత నానో డి ఏ పి నానో యూరియా వంటివి ఎకరానికి 500 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు. ఏదైనా పురుగు మందులో కూడా కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నానో ఎరువులతో పాటుగా ఆకుల ద్వారా పంట లోనికి త్వరగా శోషించబడి ఆ పురుగుమందుల యొక్క ప్రభావం పెరుగుతుంది అని తెలిపారు. అనంతరం అధిక యూరియా వేస్తే వానపాములు ఎంత త్వరగా చనిపోతున్నాయో ప్రత్యక్షంగా రైతులకు చూపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శతాభి సర్పంచి రామయ్య గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్ ఉమామహేశ్వరి సదాభి పంచాయతీ సెక్రటరీ ఉదయ్ కుమార్ మహిళా పోలీస్ కుమారి హాజరయ్యారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..