ప్రభుత్వం తొలిడుగు ప్రచారం లో ముందంజ – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలన తొలి అడుగు లో భాగంగా పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం లో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పరుగులు తీస్తోందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గూడెపు యుగంధర్ అన్నారు.బుధవారం నాడు పాచి పెంట మండలం పెద్దవలస, పద్మాపురం పంచాయతీ గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా ఇంటింటికి ఏడాదిలో జరిగిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తోందని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా..లేదా అని అక్కడ ఉన్న ప్రజలను ప్రశ్నించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెల్లే బాధ్యత మనందరిపై ఉందని కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కోరారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం మన ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం,అభివృద్ధి గురించి తేడా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందుతాయని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదని తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి సమపాలల్లో పరిపాలన అందిస్తున్నామని మీరంతా సహకరించాలని కోరారు. మండలం యూత్ అధ్యక్షులు చల్లా కనకరావుమాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలకు మనమంతా సిద్ధం కావాలని పార్టీకి ఘన విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఉపాధ్యక్షులు కొత్తల పోలినాయుడు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మతల బలరాము, మోసూరు 3 మాన్ కమిటీ చైర్మన్ పి సింహాచలం,ఏ ఎం సి డైరెక్టర్ పి నర్సింగరావు,ఎం మజ్జా రావు, తదితరులు హాజరయ్యారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..